Wednesday, March 16, 2016

అరుణ కవనాలు 86-100

[2/4, 9:30 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ చామర్తి /ముటుకూరు
హన్మకొండ
శీర్షిక : ఏమి సేతుర . . . . ! (86)

దొరికింది కోరిన ఉద్యోగపు_
 అపాయింట్మెంట్
ఇవ్వక , తప్పదట _ అగ్రిమెంట్
పర్లేదా ! ఇస్తే అ కమిట్మెంట్
అసలే చదువు _ కమ్పార్టుమెంట్

పెళ్ళికి అడ్డు ఉద్యోగ _ సెంటిమెంట్
ఇక , తప్పదు _ ఎంగేజ్ మెంట్
అసలే , నాకు _ టేంపర మెంట్

చూపగలనా అసలు _
అడ్జస్ట్ మెంట్
ఉండదు , ఎక్కడికీ ఏ _ మూమెంట్

రెండు పడవల ప్రయాణం లో అవనా _ పిప్పర మెంట్
చేతులు కాలాక ఎందుకు _ ట్రీట్మెంట్
చేస్తే , పోలా పెళ్ళి _
 పోస్ట్పోన్ మెంట్



అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి( ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :   మూన్నాళ్ళ ముచ్చట (87)

ప్రేయసి చిన్న పలకరింపు
కలిగించును  పులకరింపు

వెలుగుతో మది నింపు
 రాత్రంతా  పలవరింపు

ఆమె రాకకై చూపు సారింపు
పెళ్ళి తరువాత ఆమె పై ఏవగింపు

ఆర్దర్లు మొదలు అది సరిగా ఉంచు
పిల్లల్ని ఏమి  అనకుండా పెంచు

అహము , తల్లిని నాకూ తెలుసు
చదువుకున్నా ఎందుకు అలుసు

చూస్తుండగానే పరిస్తితి కొంప ముంచు
ఆపై కోర్టుకే విడాకుల లంచు

ఇదే నేటి ప్రేమలో ముంపు
ఆపై నిజాల గ్రహింపు

అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక : సదా మీ సేవలో (88)

ఎందుకు వారంటే భయం
                వారు మనరక్షకభటులు _    మన సేవకై ఉన్న ప్రభుత్వ
                                    సేవకులు _


రోజంతా , ఎంత కష్టమైనా పొందరు
                                         వేసట
ఏ సమయమైనా ఇస్తారు బాసట
మనకై వారు ఉన్నారను  ఊరట
అందరూ ఒకేలా అనుకుంటే అకటా!

రోడ్డున ఇష్టాన  పోతున్న నన్ను
                       ఆపిన మీదట
అన్నీ ఉన్నయని నేనూ  చూపుట

హెల్మెట్ , లేదని పరుసు
 తీసుకునే    మొదట

బండి తో వెళ్ళినతని చూసి మనసులో ఖేదం ,
ఆవేశం , ఆక్రోశం

వచ్చి చెప్పేను అతను ప్రాణం ,
    నాదికాదని
ఎదురుచూడ ఓ కుటుంబం ఉందని
నిర్లక్ష్యం చూపే  వీలు లేదని
చెప్పి , నెత్తిన హెల్మెట్ పెట్ట
         తెలిసింది అతను వెళ్ళింది నా కోసమే నని

అప్పుడొ చ్చాయి కన్నీళ్ళా , సేల్యుట

అన్నిటికీ , అందరికీ మీరు కావాలి

ఏం చెప్పినా మాకోసమే నను  
కోవాలి
మా భద్రత కై మీ ప్రాణం అడ్డు వేసేదరని


అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ చామర్తి.(ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక : మార్పు (89)
ప్రపంచాన్ని మార్చేశాయీ
                 మూడు ఆపిల్సు
మొదటిది . . . వద్దన్నా ఆడం ,
ఈవ్ లతో తినిపించి
సిగ్గు తెలిపి , జగమంత కుటుంబ మిచ్చి . . . . .

మరోటి , న్యూటన్ నెత్తిన పడి కొత్త సిద్దాంత సృష్టి . . . . .

మూడోది , అరచేతిలో ఇమిడే చరవాణి లో

మొదటిది , బిన్న ఆకర్షణ
రెండోది , గురుత్వాకర్షణ
మూడోది , అన్నీ వదిలి అందరూ
  తన పడ్డారు ఆకర్షణ
నాటి అశోకుని కి దొరికి ఉంటే          అవకాశం ,
జరిగేదా భీకర సంగ్రామం

చేసి అందరినీ దాని బానిసలుగా
తీసుకెళ్ళే వాడు తన బందీలుగా
నేటి ఉ గ్రవాదులు తెలిసీ
వాడుతున్నారు అనుకూలం గా
అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి.( ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :  తీరేనా ! కల (90)

సొంత ఇల్లు నా కల
అద్దె ఇళ్ళలో ఇంకా ఎన్నాళ్ళు ఇల
ప్రయత్నాలు మాత్రం ఆపల
లోను తీశా భయమున్నా లోపల

కొడుకు ఇంజనీరు మోజు
రాంకు రాక బోలెడు ఫీజు
ఇవ్వక , తప్పల ఇంటిని  లీజు
తిరిగి దులిపా అద్దింటి బూజు

లోనూ తీరి వెళ్ళా కోవెల
ఒక్కో చదువు ఇంత వెల
లీజు తీరాక అమ్మితే పోలా
కొడుకైన తీర్చునేమో ఆగిన కల !
[2/4, 9:33 PM] Sk Mutukuru Aruna Hnk: ..
అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . చామర్తి ( ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :   అన్నిటికీ అమ్మే గురువు :(91)

ఇంటిలోనే పడాలి " అంకురం "
చిన్ననాడే నేర్పాలి " సంస్కారం "
పెద్దల కివ్వాలి " గౌరవం "
పిన్నల ఎడ ఉండాలి " కనికరం "

అనుకున్నా, అలాగే , ఉందని నా_           " పెంపకం "
తెలుసుకున్నా ఎదిగిన వాడిలో _
  "   ఆకతాయితనం "
చెత్త వీధిలోవెళ్ళే  వారిపై వేసే _
           " పైశాచికఆనందం "
ఎలా , మార్చాలి వీడిలో ఈ _
                 " అమానుషం "
ఆలోచించి , చెప్పా నాకే జరిగిందని  _
                   "  అవమానం "
వాడిలో , చూసా చాలా " కోపం "
ఆపైన , వచ్చిన " పశ్చాత్తాపం "

హమ్మయ్య , పర్లేదు ,"  నయం "
వాడిక తప్పుచేయడు"  నిజం "
తప్పు కు ముందు తలచు అమ్మకి జరిగితే   అనీ "   తధ్యం "

వీర సార్ మీరు చెత్త చెత్త అనీ పెడితే అర్దం కాలేదు
సరే సార్
అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ చామర్తి ( ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక : అదుపు( 92)

ఎవరు చేయాలట"  అదుపు "
ఏదైనాకోనిస్తే  పెట్టి " మదుపు "
జాగర్త చెప్పని అతి " మురుపు "
జీవితానికి అగును ఓ " కుదుపు "

కొనే ముందే _ బండి _  చెప్పాలి _  " వేగపు అదుపు "
ఇచ్చే ముందే _  కంప్యూటర్ _
తెలపాలి " సమయపు అదుపు "
స్నేహితుల భావన తో చేయి "కలుపు "
తప్పక వింటారు నీ " పిలుపు "

చెప్పు అతి వేగం ప్రమాదాలలో
      " నిలుపు "
ఎంత మాత్రం కాదది " గెలుపు "
ఖచ్చితంగా అవునది " బలుపు "
కొన్నిట నిదానమే" మేలుకొలుపు "

కన్నాక కష్టమైనా " కానుపు "
పెంపకం లో చూపకు " అలుపు "
వారి విజయం మీ " ఎదురుచూపు "
ఏమైనా , రోదనమే" కన్నకడుపు "

అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి ( ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక : లోకం తీరు (93)

చిత్రకారుడు గీసిన ఓ చిత్రం
ఊరి మధ్యన పెట్టి ప్రదర్శనం
నేర్చితినిపుడే , లోపం ఎంచమని
                      విజ్ఞాపనం
చిత్రమునిండా లోపాలు చూపిన
                           వైనం
చూసి , చిన్నోడి విలాపం
పనికి రానాని ఈ కలాపం
గురువు చెప్పే నొక ఉపాయం
మరల , లోపమెకడొ చెప్పమను
                       తక్షణం
మరుసటి ఉదయం
అతనికి సుదినం
లేదు ఏ లోపపు సంకేతం
నుదుటన గురువు చుంబనం

ఇదే నీ కో సందేశం
చెప్పెను లోకపు తీరిదని
                          నిర్వచనం
లోపమున్నదని ఎంచుట సులభం
ఎక్కడో చెప్పగా రాదు సాహసం


అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.చామర్తి ( ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :  మరచితినే చెలి ! (94)


కాటిక  నడిగా తనలో కొంత చోటిమ్మని _
               నీ కళ్ళను అంటిపెట్టుకుని ఉండొచ్చని
     తాంబూలము లో కలిశా_
               నీ పెదవుల ఎరుపు పెంచాలని . . .
మెడలో హారాన్ని అడిగా ఒక ముత్యం గా నైనా ఉండ నిమ్మని _
                        నీ హ్రుదయం లో నేను ఉన్నానా అని
వడ్డాణాన్ని అడిగా _
       నిను చుట్టే సంబరం లో నాకూ భాగమివ్వమని
కాలి మువ్వల నడిగా _
           నీ పాదాల చెంత చోటిమ్మని
ఊరుకున్నా ఇన్ని అడిగి _
     మీ నాన్నని అడగడం మరిచి
అవి , చోటి వ్వనిది అలసి _
వగచా పరాధీన వయ్యావని తెలిసీ
అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . చామర్తి ( ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :    క్వాలిటీ . . (95)

ఎక్కడ ఉంది క్వాలిటీ
కల్తీ లే అని మనపై మనకే పిటీ

బంధాలలో ఉందా క్వాలిటీ_  మృగ్యం మానవత్వపు
హ్యూమానిటి

నాయకులలో ఉందా _ క్వాలిటీ
పైకి మాత్రమే సింప్లిసిటీ

కధల్లో ఉందా _ క్వాలిటీ
మావే తప్ప , బాలేవని థియరీ

తినే ఫుడ్ ఉంటోందా _ క్వాలిటీ
అస్సలు లేదు , ఆసుపత్రి బెడ్ గారంటీ

కురచ బట్టల కుర్ర నాయకి నటన లో ఉందా _ క్వాలిటీ
నవ్విపోదురు గాక , నాకు ఆమెకు
                 వెరపేటి

ఎందుకీ గోల, దొరకదు ఎటూ
             క్వాలిటీ
  పోనిద్దూ , బతికేస్తూన్నాముగా
              ఇపుడేటీ .

అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . చామర్తి ( ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక : బతకాలని ఉంది ! (96)

అమ్మా . . .
నువ్వు చె ప్పావని
 నీ మాట
కోసం
తాగలేదు ,
ఎక్కువ సేపు ఆగలేదు ,
పార్టీ నుంచీ
వచ్చి ,
బండి కూడా . .
చాలా చిన్నగా . . . .
నడిపా. .
 మరి ,  మరి , . . . ! వాడు . .
వాళ్ళ అమ్మ చె ప్పలేదో , !
అమ్మే లేదో!
నాకు శిక్ష
అమ్మా నీ
గారాల పట్టి
నడి రోడ్డుపై
దీనంగా పడి
, రక్తం ఓడుతూ . . . .
అక్కడ  చేరిన వారు
ఫోటోలు ,
వీడియోలు తప్ప _ _
ఫోను లేదు
అంబులెన్స్ కి _ _ _
బ్రతకాలని ఉందమ్మా_ . . . ! ! !
నీ ప్రేమకై . . .

ఓకె


[2/4, 9:36 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక : వీర జవాన్ ( 97)

నేనొక సిపాయిని
అయినా అమ్మకి పాపాయిని

నా కోసమే ఎపుడూ తన భయం
నాకేం కాదని ఇచ్చినా అభయం

ఖర్మ , పేలిన బాంబు చేసిన గాయం
సృహలో వచ్చాక తెలిసే నొక కాలు మాయం

అమ్మతో , స్నేహితునికి కాలు పోయిందని
మనమే చూడాలని , తనకెవరూ లేరని

ఈ రోజుల్లో మనిషికి మనిషే భారం
ఇపుడు , అతనికి అతనే భారం

అమ్మ మాటకి అచ్చెరువు
అయింది గుండె చెరువు

తప్పదు , నాకింక జీవితం నుంచీ సెలవు
పోయాక ఇక్కడ కొలువు

కాదు , కాదు నేను వీర జవాను
అమ్మని వదిలి వేయను

అందుకే , పెట్టా కృత్రిమ కాలు
అమ్మ తట్టుకోగలిగితే చాలు

అమ్మకి , నేను తప్ప ఎవరూ లేరు
ఇక , సాగించాలి అమ్మ కై బ్రతుకు పోరు

(ఇది జరిగింది కాని అమ్మ సమాధానం తో అతను ఆత్మహత్య చేసుకున్నాడు.అది నచ్చక )
అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ చామర్తి.(ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక : ఒంటరి . . (98)

అమ్మా , నాన్నలకి ఒక్కదాన్ని _
     ఒంటరిని
బాబాయి పిల్లల తగవు తీర్చిన పెద్దదాన్ని _ ఒంటరిని
తమ్ముడు , చెల్లాయి దూరంగా
చదవ బోతే  _ ఒంటరిని
పెళ్ళై వెళ్ళినా ఆయనా ఒక్కడే _ తిరిగి ఒంటరిని
పిల్లలు బడికి పోతే , ఆయన ఆఫీసు కి _ ఒంటరిని
పెరిగిన పిల్లలు స్కూల్స , స్పెషల్ క్లాసులు _ ఒంటరిని
ప్రతిచోటా పుస్తకాలని నేస్తాలుగా వున్న కలకంఠిని
అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి ( ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక : కాపీ నేర్పకు (99)

పేరులో " నేము " న్నది అని కొందరు
పేరులోనే పెన్నిధి అని మరి కొందరు
అత్తకి లేవు ఏ నియమాలు
కోడలికి ఎన్నో నిబంధనలు

తను పెడుతుంది నచ్చిన పేరు
కోడలిని పెట్టాలని మామ పేరు

కోడళ్ళకు పెడితే ఆంక్షలు
తీరేదెల కన్నతల్లి కాంక్షలు

తాత , మనవలపేర్లే తిరుగుతూ ఉంటే వంశము
కొత్తకు చోటు లేని అంశము

మనమే అనుసరిస్తే అదే అదే
నేర్పినట్టే  కాపీ పదే పదే

       
     
[2/4, 10:00 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ చామర్తి (ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక : గాజు చెట్టు (100)

గిన్నీస్ దాకా సాగాలని మన మార్గం
పిన్నీసుపై కవితైనా పర్లేదు అని చేసే సుగమం
రవీంద్రుడు నాటిన విత్తు
రారమ్మని కలిపేను పొత్తు

సుదర్శన చక్రపు వేలితో , బ్లాగులు పెడుతూ , మరో వైపు
కందము తో , కవితల తో ఎవరికీ అంతు బట్టని " కృష్ణ " మాయ

అవీ , ఇవీ , ఏవీ రావన్న " అవేరా "
పాటలు , పద్యాలు , కవితలు ఇచ్చే మనసారా

వయోభారమంటూనే , ఎన్నిటికో,
ఎందరికో సారధ్యంవహించే
 "పార్ధు" డై

పద్యాలతో
- " మాముశ " , " అరాశ " లు
చెప్పకనే రాయమన్నసవాలు

భాను , సల్లా గారి ఆంధ్రా భిమానం
చేరిన పద్యాలు ఎందరికో కొలమానం

సరి  కాదు కవితల " సిరి "

భావకవితా శాఖ కు అల్లిన " లత మాధవం"

మలయమారుతరాగం లా పల్లవిస్తూ , మాధుర్యపు పలుకులు,  కవితలనందించే " మల్లియ "

" భ్రమర " ఝుంకారం , కవిత మధురం

తనలో " కళ " చూపే సమయం లేదంటూ అడపా , దడపా చురుక్కుల చమక్కులు

గణితం లో అగణితులు , కవితతో
రమణుని , శంభుని కొలిచే  " వీర "

పోకురి , ఇదో నా కవితాస్త్రాలు అంటూ " పోకూరి "

ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ
కవితలూ వెలితిలేక మన " ఇందిర "
రాజమౌళి , విజయదుర్గలు , మధుసూదన్ ,
తన శక్తి తనకే తెలియని ఆంజనేయునిలా నేను చదవలేదనుచునే అనర్గళంగా పద్యాలు రాసే " అంజయ్య "

అర్ధ నారీశ్వర రూపానికి అసలైన ఉ దాహరణ మన " పుష్ప నాధ"

" ప్రవల్లికో " ,  ప్రహేళికో కాని భావకవిత " లలిత "

చక్కని విశ్లేషణ కు మారు మన"  cv కుమారు" , కవితల ధీరులు

మన్నె వారిని మనవారిగ మార్చిన " లలిత " కవిత

మన్నెం లో మొనగాడిని కాను కడ దాక బాలుడే మన గురువు " కడబాల "

మంచి బుద్దుల రాముడినే నంటూ ముద్దు పలుకుల " రామబుద్దుడు "

అసలు , ఇందరి పరిచయ భాగ్యం కలిగి , వ్యాసాలూ , కధలూ , సమస్య _ నివారణ మాత్రమే కాదు రాయగలవు కవిత్వం అని వెన్ను తట్టి నన్ను, చెట్టుపైచేర్చిన "mvl" దేశపతి , దివాకరశాస్త్రి ,
వార్ధక్యం గొంతులో దాచి తన కలం తో నిక్కమైన " నీలకంఠ "

వెరసి అంతా కొమ్మపై వాలిన " "హిమ "  పక్షూల్ల _ కవితాక్షూలము నేలను తాకిన తొలి సూర్య కిరణం " "అరుణం "
ఈ వృక్షమునకు దిష్టి నివారణం

సారులకే కాదు అందరికీ ఇస్తున్నా
 ఇక్కడ గారు (రె )లు


రాసి , రాసి , వేలు వాచి
రాసి కన్నా వాసి మన్నిక న్నా
కొన్ని నాసి కవితలనీ ప్రోత్సహించిన అందరికీ శతాభివం
దనం

అరుణ కవనాలు

అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :     ప్రేమ (1)
ప్రతీ రోజూ _
చెప్పాలా . . . .
నీ పై _
నా_
ప్రేమని . . .
పొద్దున . .
నిన్ను
లేపిన . .
సమయం లో
పెట్టే . .
చిరు
ముద్దు . .
పడుకునే
వేళ
కొసరు
ముద్దు . .
తెలపలేదా
నీపైన
నా
ప్రేమని . .
అవునేమో . . .
అపుడు . . .
రోజు లో
ఎపుడో కానీ _ _
ఉండేది
కాదు
నీ దర్శనం . .
అందుకే _
నా
కళ్ళలో
నిను చూసిన
పరవశం _
మెరుపుల
ప్రదర్శనం _
ఇపుడు _
నాతో నె
ఉన్న . .
నిన్ను
చూస్తూ
రోజూ
మెరుపే
అది _
నువ్వే
గుర్తించలేదు . . .

[2/6, 5:34 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.చామర్తి.( ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :    నాన్నా ! ఇంత శిక్షా ! ! (2)

నాన్నా ! !
వేలు
పట్టి
నడిపిస్తుంటే
చంటి పాపలా . .
నేను . ,
నాకుగా .
నడవడం . .
నేర్చుకోలేదు . . .
నాన్నా ! !
ఏడిపిస్తూ ,
అమ్మ ,
అంటే . . .
వయసోచ్చినా . . .
మా దగ్గరేమి టీ . .
ఇంకా పడక . .
అంటే . .
ఏదో . .
రోషంతో . .
అన్నా . . రేపటినుంచీ . . _
ఇక _ పడు కోనని
అందుకు . . . . .
అందుకేనా . . .
ఇంత , శిక్ష . .
నువ్వు . . నేర్పావు _ _
నీకు . . చూపాలని _ _
బండి పై _ _
తీసుకెళ్ళా. . .
సరిగా . ఉ న్నా
మలుపులో . . . .
లారీ దూసుకెళితే _ _ _
నెలరోజుల . .
కోమా నుంచీ విరిగిన కాలుతో . . .
నేను . .
మరి . . . . మరి . . .
నువ్వు , కనపడవే
తెలియదు . . .
అపుడు . . .
ఇంటి గోడపై . . .
వేలాడే దండ . . .
ఉందని . .
నీ . .
ఫోటో కి . . . .
(ఇది మా ఇంటి దగ్గర , నన్ను ఇష్టపడే ఒక ఆవిడ నాతో పంచు కున్న స్వానుభవం )
అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక :   గాయాలు (3)

కాయలు ఉన్న చెట్టుకే
           రాళ్ళ _ దెబ్బలు

మధురంగా మ్రోగే పిల్లనగ్రోవి కి
         నిలువెల్లా_  గాయాలు

విషయం ఉన్నవారిని నిజాయితీగా
         ఎదుర్కోలేక_  నిందలు

ఆప్యాయత చూపినా అసూయ పడడం కొందరి  _ _ నైజం

ఓర్పు కొందరికి పెట్టని _ ఆభరణం

జంట పక్షి మరణం _ జరిగిన
 ఆవిష్కా రం

చెట్టు , దెబ్బలు తిని _ _ ఫలాలని ఇస్తుంది

గాయాలగ్రోవి _ _ మధురగీతాల నిస్తుంది

నిందలు , నిజాయతీ కి _ _
         గీటురాళ్ళు

 అసూయ అభద్రత కు _ తొలి మెట్టు

ఓర్పు తెలుపును నేర్పు _ కాదది
       చేతగానితనం

మార్చింది రత్నాకరుని _ వాల్మీకి గ
రాయించేను _ రామాయణ కావ్యాన్ని
[2/7, 3:42 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక : కలయా ! (4)

నా చూపుడు వేలికి . . . .
 అలసటే
లేదు _
స్పందిస్తూ . . .
కవిత రాస్తూ . . .
కదులుతూ
వుంది
కను దోయి
చంచలం గా
చరిస్తూ . . .
పైకి _
కిందికి _
హై కు కి _
wasp _ కి
అదాటు న
మెలకువ
వచ్చి
చూద్దును
కదా
మా
వారు
జాలిగా
చూస్తూ . .
అంటే
ఇదంతా _
కలా _
కలవరింతా . .
నిజములో
మునిగి . .
కలలోనూ
కదిలించానా _
ఏమో _ ?
ఎంత పని చేసింది
నా
కవిత ,
స్పందన .
[2/7, 8:25 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక : పరీక్ష (4)

బడిలో వేసిన నాటి నుంచీ
    అనుకున్నది చదివేదాకా
               __పరీక్ష

నాయకుల కి ఎన్నిక ఫలితాలు
        వచ్చేదాక _ పరీక్ష

ఈడు వచ్చిన పిల్లకి పోకిరిల
     ప్రేమ గోల తప్పించు కోడం _
           _    పరీక్ష
వయసు వచ్చిన పిల్లకి ప్రతి
    పెళ్ళి చూపులు _ పరీక్ష

పెళ్ళి తర్వాత , ఆ ఇంట ఎలాఉండాలో , వారెలా ఉంటారో
       _ పరీక్ష

ఆనక , అమ్మాయా , అబ్బాయా అని _ అమ్మాయైతే సమ్మతమేనో
         కాదో _   పరీక్ష

కొందరు మూర్ఖులు డి.యన్.ఏ , కన్యాత్వ - పరీక్ష


పెద్దయ్యాక పిల్లలు దేశంలో ఉం టారో , లేదో _ ఉన్నాతమతో నో
     కాదో _ పరీక్ష

జీవితం పరీక్ష పెట్టి పాఠాలు నేర్పితే , చదువు పాఠాలు చెప్పి పెడుతుంది _ పరీక్ష
[2/7, 8:25 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణచామర్తి  ( ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక :    అమ్మాయి  మనసు (5)

కొత్తగా రెక్కలు వచ్చిన భావన
పైపైకి ఎగరాలని  కోరిక హృదిన

స్వేచ్చ కోరిన వయసు . .
రెక్క తొడిగిన సొగసు . . . .

చిచ్చు పెడుతున్న మనసు . .
తప్పని దానికేం తెలుసు ! !

కన్నులు కలువల రేకులని ,
నడకలు హంసల  వాకలని

నిక్కమైన నీలానివని ,
ఎంతటి మేధావి వో నని

పొగిడి , పొగిడి అలసి పని కాదని
విసిగి, విసురుగా బెదిరించి కుదరక
వదిలిన పురుష పుంగవులు
పరాయి అమ్మాయిలో ఆడతనమే

చూసే అందరినీ తప్పించుకుని
తిరిగి స్వేచ్చ దొరికిన _ _ఆనందం


అమ్మానాన్నల _ పెంపకం
అందించిన _ వివేకం

తప్పనీయదు _  అదుపు . . .
తిరగనీయదు  _ తప్పు మలుపు . . .
[2/7, 8:28 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక : కలయా ! (6)

నా చూపుడు వేలికి . . . .
 అలసటే
లేదు _
స్పందిస్తూ . . .
కవిత రాస్తూ . . .
కదులుతూ నె
వుంది
కను దోయి
చంచలం గా
చరిస్తూ . . .
పైకి _
కిందికి _
హై కు కి _
wasp _ కి
అదాటు న
మెలకువ
వచ్చి
చూద్దును
కదా
మా
వారు
జాలిగా
చూస్తూ . .
అంటే
ఇదంతా _
కలా _
కలవరింతా . .
నిజములో
మునిగి . .
కలలోనూ
కదిలించానా _
ఏమో _ ?
ఎంత పని చేసింది
నా
కవిత ,
స్పందన .
[2/7, 8:28 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక : న్యాయమా ! అంటే ! (7)

నీకు న్యాయం కావాలా !
అంటే ,
అసలు , ఏంటి
నువ్వే
గొప్ప అనుకుని . .
కన్నవారికి సైతం
చెప్పి అబద్దం
కలిశావు బాయ్ ఫ్రెండ్ ను
అమ్మాయిగా , అనుక్షణం
చెప్పినా జాగ్రత్త
వినక
ఇపుడు
మహిళా సంఘాలు ,
టి.వి ఛానళ్ళు
తీరుస్తాయా ఆపద
సంసారం ఒక చదరంగం ,
అందమైన జీవితం ,
బతుకు జట్కా బండి
ఏ రాయి అయితే నేమి
పళ్ళు ఊడగొట్టేందుకు
నీకు ,
ఆ కుటుంబం
కావాలంటే
రచ్చ కెక్కించి
ఆనక వారితో
ఎలా
కలిసి
ఉండగలవు    !
భర్త అయినా
ప్రేమికుడు అయినా
ఎలా
ప్రేమగా ఉంటారు
[2/10, 5:41 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :  ప్రతిరూపాలు (8)
ఓయీ ! జాబిల్లీ !
మిడిసిపడకు . . . .
నువ్వే మహా _
అందగాడి నని . . .
నువ్వు
చుక్కల్లో
చంద్రుడి వే
కానీ . .
మా నేల
పై
ప్రతి తల్లి కి _
తన పిల్లలూ . .
భూమి అద్దం లో
నీ _
ప్రతిబింబాలే .
తెలుసా
[2/14, 12:50 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . చామర్తి (ముటుకూరు )
హన్మకొండ
13_ 2_ 16
 శీర్షిక : ఏ నిమిషానికి (11)

ఇంతే ఇంతే జీవితం
వింతైన  చదరంగం
ఎన్నో అనుకుంటాం
ఏమో కలలు కంటాం

రేపేమగునో తెలియని నిజం
కళ్ళకి  కనిపిస్తున్నా వాస్తవం
నమ్మలేము అసలైన సత్యం
అయినా , ఇంకా ఏదో ఆరాటం

జీవితమంతా బ్రతుకు పోరాటం
బంధాలు   రంగుల రాట్నం
ఎందుకో బంధాలు కలపడం
అంతలోనే , విడదీయడం

ఏమిటయ్యా , ఈ విచిత్రం
నువ్వు చూస్తావు తూకం
జ్ఞాపకాలతో చేస్తూ  నేస్తం
మాకేమో అంతులేని శోకం
[2/14, 12:50 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . చామర్తి (ము టుకూరు  )
హన్మకొండ
13_ 2_ 16
శీర్షిక : ఎండుకిలా చేశావు (10).

నీ నుదుట న . . .
చిటికెడు . .
కుంకుమ . .
కోసం _ ,
నీ పాదాల _
నంటి
 ఉండే
పసుపు కోసం _
నన్ను _
ఒంటరిని _
చేశావా _
నీ _
చిరునవ్వేగా ,
నా అలసట
తీర్చే
పరమోషధి
మొదటి సగ జీవితం
ఆదర్శ భర్తగా ,
నీవు లేని
మిగిలిన
జీవితం
ఓ ప్రశ్నార్ధకంగా !
ఎలా. . . .
మనగలను _
ఆనందం ,
ఆగ్రహం.
అభినందన
అలకలు
అన్ని కలిసి
పంచి
ఇది మాత్రం
నువ్వు
ఒక్కదానివే
తీసుకున్నావు
నువ్వు _ తెలుసుకోలేదు
నువ్వు లేని
నేను
జీవఛ్ఛవం అని . . .


[2/14, 12:50 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ . చామర్తి (ముటుకూరు )
హన్మకొండ
13_ 2_ 16
 శీర్షిక : ఏ నిమిషానికి (11)

ఇంతే ఇంతే జీవితం
వింతైన  చదరంగం
ఎన్నో అనుకుంటాం
ఏమో కలలు కంటాం

రేపేమగునో తెలియని నిజం
కళ్ళకి  కనిపిస్తున్నా వాస్తవం
నమ్మలేము అసలైన సత్యం
అయినా , ఇంకా ఏదో ఆరాటం

జీవితమంతా బ్రతుకు పోరాటం
బంధాలు   రంగుల రాట్నం
ఎందుకో బంధాలు కలపడం
అంతలోనే , విడదీయడం

ఏమిటయ్యా , ఈ విచిత్రం
నువ్వు చూస్తావు తూకం
జ్ఞాపకాలతో చేస్తూ  నేస్తం
మాకేమో అంతులేని శోకం
[2/21, 3:42 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :వెలుగు ఆరుతున్న తెలుగు (14)
21_2_16

త్రి లింగ క్షేత్ర మధ్యన .....

త్రిలింగ దేశం
అయింది తెలుగు దేశం
వచ్చిండన్నా,వచ్చాడ న్నా
వరాల తెలుగు
మనదే నన్నా ...!
మనమేమో ,తెలుగు వారం
మీకులేదా అమ్మ భాష పై  మమకారం .....

పరాయి భాషా .... నాయికలం
మీ భాష ని మా భాష గా నేర్చుకున్నాం ......

 చేశారు .....తెలుగు.... రాష్ట్రాన్ని రెండు ముక్కలు
ప్రాంతీయ భావం తో .....దూస్తు మాటల కత్తులు

తుళురాజు చెప్పే నానాడే
దేశభాషలందు తెలుగు లెస్స యని

కొమ్ములోచ్చి నేడు రాని ఆంగ్లాన్ని వచ్చిన యట్లు

కొమ్ములు ...వత్తులు విరిచి ఆంధ్రాన్ని వచ్చినా ....రాని యట్టులూ..

పక్క రాష్ట్రాల ,దేశాల వారు
వారి భాషపై ప్రేమ చూపిన చందం
వెలిగించి చూపండి మీ భాష అందం
 దె బ్బతగిలితే ...."అమ్మా "
     అని నీ నోట
లేనపుడు ......రాదే అమ్మ భాషా మాట
[2/21, 3:45 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :ఏదీ  నీరు  (15)
21_2_16

కవితో ,పద్యమో అంటే అంశ మొచ్చి చెరువు ...
తలచిన యంత నే అయింది గుండె చెరువు ...

అమ్మమ్మ ఊరిలో పిన్నులు అందరితో చె రువుకి ...
చిన్న బిందె తోవెళ్ళి , చెలిమనీరు తో బయటికి ..

చాలా నాళ్ళకి ఊరెళితే ...
ఇంటి ఇంటి కీ బోర్లు ....
చెరువు జాడ లేని ఊరు ...

నానమ్మ ఊరిలో మూలబావి నీరు ....
అందరి దాహాన్ని తీర్చిన బావి అడుక్కు పోయిన నీటితో .....మూల బడి

నాటి జ్ఞాపకం ఎంతో పదిలం..
నేటి స్తితి వద్దు మనసు వికలం....
[2/23, 10:29 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ చామర్తి (  ము టు కూ రు )
హన్మకొండ
శీర్షిక :మహిన మహిమ (16)
23_2_16

సమ్మక్క ,సారలమ్మ దేవతలు అవునో ,కాదో
అవును ,వీర నారులు
వారి మహిమో ,అదేమో గానీ
ప్రసాదమైన బంగారం
ఒక్క చీమనీ చేరనీయని వైనం

కాదా ,ఇదీ విడ్డూరం
ఎన్ని నాళ్ళు ఐనా ,_మన ఇంటికి చేరినా _
చేరదు ఏ క్రిమికూడా ...

ఎన్ని సదుపాయాలు చేసినా,
లక్షల మందికి ఎండిన పొలాలు కాదు ,వాహనాల కే
అవునవి ,విసర్జన కూ

జాతర అయిన పిదప ఏమున్నది !
ఎటచూసినా __జంతు అవశేషాలు ,మానవ విసర్జితాలు ......
భీభత్సం ,ఆ దృశ్యం _
రెండు రోజులకి దిక్కు దిక్కు వర్షం ......
మాలిన్య మంతా మాయం ..
బంగారపు వేడి వల్లో..._ ,సమ్మక్క మహిమ లో _
జరిగేది మాత్రం వాస్తవం !
కొత్తవారు  నమ్మలేని నిజం.
జాతర అనంతరం ,ఋజువు చూపే  సత్యం
మరి ,ఇది వారి మహిమ కాక,  ఏమిటి ....
ఎండమండు సమయాన జడివాన వారి వల్ల కాదేం టీ !!
మహిన వారు చూపు మహిమే ఇది అంటి
[2/23, 5:22 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి.(ముటకూరు)
హన్మకొండ
శీర్షిక :భద్రత (17)
23_2_16

తెలివైన వారం, మనుషులం ,అనీ విర్రవీగడం కాదు

కోతి నుంచీ "మర్కటకిషోరన్యాయం "

పిల్లి నుంచీ "మార్జాల కిషోరన్యాయం "

చూసీ ,నేర్చుకున్నది ఉం దా ?


గడ్డి తినే కుందేలు ,పిల్ల పుట్టే ముందు చేసే జాగ్రత్త
తన జూలు క్షీర చూష ణ కై పీకి అదే పేర్చును మెత్తగా

పక్షులు కట్టు చక్కని గూళ్లు ,
ఆపైనే ,పెట్టును గుడ్లు

ఏ జంతువు రానీయదు తన సంతానం జోలికి
నువ్వూ ,నమ్మక ,ఎవరిని ,చూసుకో బిడ్డని కలికి

మనుషుల మై ,లక్షల ఉ ద్యోగ మని ,పరాయి దేశఅవకాశమని
పిల్లలు ఇపుడే ,వద్దనుకున్నా ,_పుట్టిన వారిని  ఎవరినో చూడమని

లక్ష్య సాధన లో ,పిల్లల ,నడత ,గమనించక
ఎపుడో ,తెలిసి ,తోట కూర నాడే ,అనలేదని ,ఏమనలేక

మరీ ,మనమా !తెలివైన వారము ?
[2/23, 10:27 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
 sk585
అరుణ.చామర్తి (ముటుకూ రు    )
హన్మకొండ
శీర్షిక :నైజం
23_2_16
 ,ఒ క్కోరిలో ఒ కోలా నైజం
మంచి అయినా ,చెడు అయినా
కోతి బుద్ది కోతిది ,కుక్క బుద్ది కుక్కకి సహజం

మనిషిగా ,మారాక కూడా వదలని జంతు నైజం
కొందరిలో అది పోదు ,నిజం !

ఓ మహాకవి మాట బుధవరు ల నోటవిన్నంత ,కన్నం త
నేను విన్న -కన్న -చదివిన ఓ కధ పాత్ర లో నున్నం త

ఒక సాధువు ,శిష్యుల తో ఎ చటి కో పయనం .......
మార్గ మధ్యాన సంధ్యా వందనం .......

చేతిలోని నీటిలో చెట్టునుండి జారిన తేలు
చూసి ,రక్షించ నేలపై విసరబోగా ,కుట్టే నది ,వేలు

సాధువు కైనా నొప్పి కాదా ,!విదిలించగ  చేయి
మరల నీటిలో పడి ,మునకలు వేసిన తేలు

అయ్యో ,పాపమని ముని ,
తిరిగి ,అది కాటు వేసి నీటిపై చని ....

ఇట్లు ,జరుగగ కొన్ని మార్లు ......
ముని కాటు భరించి ,ఎన్ని మారులు ?

అనుచు విసిరే తరువు చెంత
చెరువు నుండి రాగ ,తీరే తేలు చింత

చూసిన ,శిష్యుడు ఒకడు, అర్దం బే మి యని అడుగ
కుట్టు ట దాని నైజం.,మనిషి నైజం నేను ఎట్లు విడు వ

సమాధాన మిచ్చి సాగిపోయే గురువు ,శిష్య కోటి వెంట రాగా !
[2/26, 3:56 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి.(ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :ఎంత  అబ్బురమొ (20)26_2_16

పూర్వం సందేశం పంపా లంటే -పావురం

మనమే వెళ్ళాలంటే -పుష్పక విమానం రావణ కాలం లోనే

   ఆధునికమయ్యాక ఏ దేశం
లోని మన వారికి_ ఎమ్ పంపాలని అన్నా _ఎన్నో మార్గాలు -ఫేడెక్స  లా

మనకై -విమానాలు -పడవలు

 ఇప్పటికే ,కేరళ లో రోడ్డు పై నడిచే బస్సు -నీటిలో దిగితే పడవ

రాబోయే తరం లో -కారులో అందించే రవాణా -ఎంత  దూరమైనా ఎగిరి వెళ్ళి అందించు- విమానం లా

మునులు ఆ రోజుల్లో వాడిన పాద లేపన రహస్యం
వాడారేమో -చోద్యం
[2/26, 4:15 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
Sk585
అరుణ.చామర్తి(ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :దూరపు కొండలు( 19)
26_2_16

కాలు సరిగా లేక కర్రతో నడిచే వానికి -
కాళ్ళతో వెళ్ళే వారిని చూస్తే బాధ

నడిచి వెళ్ళే వారికి -
సైకిల్ పై వెళ్ళే వారిని చూసి బాధ

సైకిల్ పై వెళ్తూ -
మోటార్ బండి పై వెళ్ళే ఆనందం లేదని బాధ

మోటరు బండి పై వెళ్ళే వారు పక్కన ..
కారు లో షికారు చూసి బాధ

కారుతామే నడిపే వారికి -డ్రైవరు నడుపుతుంటే ,దర్జాగా కూర్చున్న వారిని చూసి బాధ

వీరంతా -ఎదుటివారి కున్నది మాకూ లేదేమని బాధ ..

దేవునికి తెలుసు -మనకేం ఇవ్వాలో..

కానీ..మనకే తెలియదు -అన్ని అవయవాలు సరిగా ఇవ్వడమే...ఎంతో  గొప్ప..

అందుకే.. కడుపు ఒకటే ఇచ్చిన దేవుడు...

కష్ట పడమని...
కాళ్ళు చేతులు రెండు రెండు ఇచ్చాడు..

ఎప్పుడూ..దూరపు కొండలు -నునుపే...

ఎదుటి వారిని చూసి.. ఉన్నతికి ఎదుగు...

అంతేకానీ.. వారి ఉన్నతికి
ఏడవకు..

మనకి...ఇవ్వలేదని కాదు -ఇచ్చినదానినుంచీ...ఏంసాధించగమా! అని ఆలోచించు..

సాధించే అవకాశం గుర్తించు -..

ప్రయత్నించి... చూడు..
విజయం నీదే..
[2/27, 9:18 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి.(ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :ఎంత  అబ్బురమొ (20)    26_2_16

పూర్వం... సందేశాలు పంపా లంటే -పావురం

మనమే వెళ్ళాలంటే -పుష్పక విమానం..

   ఆధునికమయ్యాక .....
పరాయి దేశాలలో ఉంటున్న...

మన వారికి_
ఏమి పంపాలన్నా..
అనేక రకాల కొరియర్స్..
విషయాలకి ఈ.. మెయిల్స్_మచ్చుకి .
వస్తువుల కి ఫేడెక్స్..పంపడానికి

మనం వెళ్ళాలన్నా..
విమానాలు -పడవలు

 ఇప్పటికే ....,కేరళ లో.. ఒక వైపు...రోడ్డు పై నడిచే బస్సు -
మరోప్రక్క....నీటిలో దిగితే పడవ ...

రాబోయేకాలాన.....
- టెక్నాలజీ. పెరిగి..

రోడ్లపై నడిచే విమానాల వంటి.. కార్లు..

అవి అందించును ...
మనకు రోడ్లమీదనే...

విమానయాన అనుభూతిని..

మనకు కావాల్సిన. వాటిని అందుకొనుచూ...

వాటిల్లో  కొంతదూరం
ఎగరవచ్చు..

-గమ్యం చేరిన చోటునుంచి...
తిరిగి...రహదారి పై నడక


మునులు ఆ రోజుల్లో
 వాడిన..
 పాద లేపన రహస్యం ...

మరల ఇప్పుడు
వాడుచున్నారేమో ?-చోద్యం మే మరి.....
[2/28, 7:50 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ చామర్తి (ము టుకూ రు )
హన్మకొండ
శీర్షిక :   కన్నీరు (21)
27_2_16

కన్నీళ్ళు.కవిత లేదా దీనిపై
కన్నీరు వస్తుంది సంతోషం ,బాధా ల్లో
కన్నీరు వెనకాల భావం ఎవరికి ఎరుక
కన్నీరు ,కార్చే వారికి ఎరుక అందుకు కారణం
కన్నీరు ,మారుతుంది ఆనంద భాష్పాలు గా
కన్నీరు ,కళ్లని చేస్తాయి .... శుభ్రం
కన్నీరు  చేస్తాయి మనసును.. ఛిద్రం
కన్నీరు ,ఒక ఓదార్పు__ బాధించే భావానికి
కన్నీరు రానీయకున్న చిహ్నం __అనుభవానికి
కన్నీరు పసిపిల్లల పాలిట బలము
కన్నీరు ,సృష్టిం చు కలకలం

కన్నీరు వస్తూంది కొన్ని కధలకి ,కవితల స్పందన

కన్నీరు ,బాధని పోగొట్టే  సాధనం

కన్నీరు ,కొండొకచో దొంగ కన్నీరు ,మొసలి కన్నీరు

కన్నీరు ,కారణం ఉల్లి లోని సల్ఫర ట
కన్నీరు ,ఉల్లి లేనపుడు వచ్చిన ,అది దుఃఖం అకటా

కన్నీరు కొన్ని మరిచేటం దుకు వరం
కన్నీరు ,కొన్నగుర్తు  కావాలనుకున్నచోట శాపం

కన్నీరు ,ఒంట్లో ఎక్కువైన ఉప్పు తొలగించే సాధనం
కన్నీరు ,చెడుగొట్టేనట ముఖారవిందం
కన్నీరు ,అవునట,ఆంటీ బ యాటిక్ ,ఇది నిజం

కన్నీరు ,కేకి కంట చేరి పెంచును _వంశం
కన్నీరు ,ఎందుకిచ్చారో ఈ_ అంశం

కన్నీరు ,తెలుసా !చాలా విలువైనవని
కన్నీరు ,చేయకు వృధా అనర్హుల కోసమని
కన్నీరు _కొందరు స్ర్హీలకి ఏదైనా సాధించే _ఆయుధం
కన్నీరు ,మనతో పెట్టిస్తారు _ష్ అనకండి ఎక్కడా _ఆ విషయం
కన్నీరు ,కలకంఠి కంట నొ లికిన సిరి ఉండదని వినికిడి
కన్నీరు ,పెట్టే మగవారిని నమ్మరాదని నానుడి
[2/29, 3:19 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :అభిమానం (22)
28_2_16
అభిమానం ...
మనవారిపట్ల సహజం

అభిమానం...
 ,దురభిమానమై తే..  వేసేను...వెర్రి తలలు

అభిమానం ,ఎన్నెన్ని రకాలో ...

కులం ఒకటే నని .. కలాభిమానం..

మతం ..ఒకటేనని.. మతాభిమానం..

కులం లోనితెగ -శాఖ ఒకటేనని.. శాఖాభిమానం..

.ఒకే భాషయని..  
   భాషాభిమానం

ఒకే రాష్ట్ర మని
అభిమానం...
రాష్ట్రాభిమానం..

ఒకే దేశమని
దేశాభిమానం..

ఒకే ప్రాంతమని ..
ప్రాంతాభిమానం..


ఒకే వృత్తి అని
అభిమానం..

వీటికి అతీతంగా
       నటుల పై ,
         కవుల పై ,          నవలాకారులపై ,
   చిత్రకారులపై ,
       ఆటగాళ్ల పై,
       దర్శకులపై ,
  కొరియోగ్రఫర్ల పై ,
 పెంచుకున్న లేదు తప్పు.

అభిమానం వారిలో నటించే ..ఆడే ... రచనల...నేర్పు పై ప్రశంస ఉండాలే కానీ..

ప్రాంతం  .. పై చూపితే
అది  ఎన్నటికీ కాదు అసలైన ..అభిమానం ..

లోపాలున్నా సహించి నిలిచేది
అభిమానమైతే..

అది..ప్రాంతీయా   భిమానమౌవుతుందే               తప్ప..

వారి విద్వత్తు కి    గౌరవం
ఇవ్వనట్లే... కదా!
[2/29, 3:31 PM] Sk Mutukuru Aruna Hnk: అయుతకవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :  వాస్తు వాస్తవం(23)
29_2_16
వాస్తు ఐనా ,నియమాలు ,పద్దతులు ,విభజనలు
అన్నీ _మన మంచికే
చక్కని మనుగడ కే
మన పూర్వీకులెంత యోచనాపరులు డ్రైనేజి నీరు _తూర్పు దిశకే నని
చెప్పారు అంటే అందరూ ఒక వేపె పారించిన నీరు _
పారిశుధ్యం ఉండు కదా _చక్కని తీరు

పెద్ద పడగ్గది _నైరుతి నే నంటే రహస్యం తెలుసా !
పగలు వేడెక్కిన గది _సాయం సమయాన దక్షిణ ,పడమర గాలులకు చల్లబడు ననే మనసా ...

నిప్పు ఆగ్నేయ మన్న -నిజమది -మర్మమేమి లేదు
కట్టె పొయ్యి పొగ ,వంట వాసన బైటికి పోయే _చక్కని మార్గం
 ప్రత్యక్ష నారాయణుడు
కిరణప్రసారం _సూక్ష్మ క్రిములు నాశనం.

ఇపుడు ,గాసు పొయ్యి ,కొండొకచో ,చిమ్ని కూడా ఉంటున్న ఇంట ,వంట గది ఎక్కడున్నా రాదు ఇబ్బంది
ఇక ,దక్షిణ మైన ,పడమర నైన వచ్చుకదా _ మంచిగాలి
అది ,పోరాదనే పెంచుట (etn)
నిషేధం అన్నది సత్యము
 
కిటికీల కూ ఉన్నదొక లెక్క
చక్కని ,చల్లని గాలి _వెలుతురు మన సొంతం

అందుకే ,ఏ శాస్త్ర మైన చూడాలి  హేతుబద్ధత
పాటించడం మన నిబద్ధత
[3/1, 7:56 AM] Sk Mutukuru Aruna Hnk: [29/02 3:10 pm] అరుణ . చామర్తి (ముటుకూరు: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)      హన్మకొండ
శీర్షిక :నమ్మకం (24)
29_2_16
నమ్మకం _పుట్టే ముందే క్షేమంగా లోకం లోకి తెస్తుంది అని డాక్టర్ పై
నమ్మకం _ పుట్టాక ,చెప్పకనే ఆకలి తీరుస్తుంది అని అమ్మపై

నమ్మకం _ఎత్తు ఆడించి ,ఏ కష్టం కలగ నీయడు అని  నాన్నపై

నమ్మకం _ప్రేమగా చూస్తారు అని బంధువుల పై

నమ్మకం _చదువు చెప్పి ,ఎదిగేలా చేస్తాడు అని గురువు పై

నమ్మకం_వయసు వచ్చాక తగిన వారిని తెస్తారు అన_ి అమ్మ నాన్న లపై

నమ్మకం _చక్కగ కలిసి ఉంటాము అని అత్తింటి వారిపై

నమ్మకం _ప్రేమ కురిపిస్తారని _పిల్లల పై

ఇది కలియుగము -ఆనాటి కాలం కాదు
గుడ్డిగా నమ్మితే _మంచి స్నేహం జీవితాంతమూ
లేదా ,చక్కని పాఠం జీవితం లో
అందుకే ,నేర్పాలి పిల్లలకి -క్షీర -నీర న్యాయం _
నమ్మక -అపనమ్మక మధ్యన దూరం
[29/02 10:44 pm] అరుణ . చామర్తి (ముటుకూరు: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ .చామర్తి
(ము టుకూరు) )
హన్మకొండ
శీర్షిక :పరిణతి (25)
29_2_16

పరిణతి అంటే _పెరగడం కాదు వయసు ....
పెద్దరికం అంటే _వయసువల్ల
కాదు _వచ్చే ముసుగు ..

 స్నేహం అయినా ,శత్రువు లోనై మంచిని మేచ్చే సోబగు.....
 అపుడే ,పదిమంది లో పెద్దమనిషి తరహా పొసగు ..

స్నేహం లో _ఎంచకు లోపం
లోపం తో నైన _అభిమానం స్నేహం

మనసు నొచ్చిన  స్నేహంలో_
తమాషాగా పోగొట్టుఅపోహ
నువ్వూ చేస్తూ_అదే  _చెల్లుకు చె ల్లను ఊహ

బాధ రుచి ఎరిగి .....అదే స్నేహితుల కిస్తే _ఏముందీ  తేడా .....?
అపార్ధాలు పెరుగును_ మీరినా _ఈడు


పరిణతి అర్దం తూలనాడినా నిన్నే _నవ్వుతూ చెప్పే సమాధానం
పెరిగిన వయసు ఇస్తే కోపం
చేరరు ఎవరూ నీ సన్నిధానం
[3/2, 2:14 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి(ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక :స్నేహం (26)
2_3_16

స్నేహం _ఆడా ,మగా వివక్ష లేనిది

స్నేహం _పేద ,గొప్ప తేడా చూపనిది

స్నేహం _ వయసు బేధం తెలియనిది

స్నేహం_,లోపం చెప్పి సరిదిద్దేది

స్నేహం, _నీ మౌనాన్ని కూడా అర్దం చేసుకోగలిగేది

స్నేహం ,_మొహం పై నవ్వు వెనక బాధను గుర్తించేది

స్నేహం _,ఎప్పటికీ ,తీయనిది

స్నేహం_ ,మనుషులు దూరం గా ఉన్నా ,మనసుకు దగ్గర ఉండేది
స్నేహం _,మనలనిలా కలిపేది

స్నేహం ,_కట్టే కాలేదాకా ఉండేది

స్నేహం _పంతాలు -పట్టింపులు పోనిది

స్నేహం _తప్పులు క్షమించగలిగేది

స్నేహం _ఎప్పుడూ విడి పోనిది

స్నేహం _అహం చూపనిది

స్నేహం _ఏ పరిస్తితి లోనూ కల కాలం నిలుపుకునేది
[3/6, 1:09 AM] Sk Mutukuru Aruna Hnk: [03/03 5:07 pm] అరుణ . చామర్తి (ముటుకూరు: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి(ముటుకూరు)
 హన్మకొండ
శీర్షిక :ఇరువురు భామలు(27)
3_3_16
నింద మోపిన వాడు సత్రాజిత్తు
నింద బాపుకుని  శ్రీకృష్ణుడు చేసే చిత్తు
కోపం తప్పించ నెంచి వేసెను ఎత్తు
నా కొమరిత సత్య నిత్తు
కాదనక ,సత్య ,అనేను వెంట వత్తు

సాధ్వి రుక్మిణి ,తానూ ప్రేమించి
ఆతనినే తనవానిగా నెంచి
బ్రాహ్మణు రాయబార మంపించి
ఎదురుచూసి ,వేగరప్పించి
ఆతనితో యుద్దం ,పాణి గ్రహణం చేయించి
........
ఇంత,చేసిన రుక్మిణి పరమ శాంత ,
జనక మాటకైకట్టుబడిన సత్య గయ్యాళి
ఇదెక్కడి న్యాయం ?
[04/03 10:34 pm] అరుణ . చామర్తి (ముటుకూరు: అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.చామర్తి (ముటుకూ రు )
హన్మకొండ
శీర్షిక ; బ్రహ్మ ఇచ్చిన బంధం( 29)
4_3_16

మట్టి ముద్దకి ప్రాణం పోశాడు ఆ బ్రహ్మ
అన్నీ తానై నేర్పి గొప్పగ నిలబెట్టే  అమ్మ

రాత రాసే పం పును ఆ బ్రహ్మ
సరి లేదని వదలదు ఏ అమ్మ

అన్నీ నేర్పే అమ్మకి ,అపర బ్రహ్మ నాన్నే
నాన్నలా  అనునయంగా చూసేది అన్నే

తనకు లేకున్నా అమ్మ ,మనకి ఇచ్చాడు బ్రహ్మ
అమ్మగా మారి ఆదరించే స్ర్హీ గా ఈ జన్మ

తనకు పుట్టిన వారికే కాదు తానూ అమ్మ
అందరినీ ప్రేమగా చూసే కమ్మదనం అమ్మ
[05/03 9:36 am] అరుణ . చామర్తి (ముటుకూరు: అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణచామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :తీయని  తలపు (30)
5_3_16

నీవు వస్తే వచ్చే గంధపు పరిమళం ....ఆపేనా తలుపులు
నీ రాక ,గుర్తించి .....ఉవ్వెత్తున ఎగసే ఆనందపు తలపులు

నీ సుతిమెత్తని అడుగుల సవ్వడి తో చిరు గజ్జెలు చేసే సందడి ...
వింటూ... వస్తున్నావన,ి సరాసరి నా గుండె గూటికి... మది చేసే అలజడి

అందాల అపరంజి వే....కాదు,అన్నింటిలో మే టి
తూగగలనా ,నీతో కాగలనా సాటి

ఓపగలేను నీ తిరస్కారం
సర్ది చెప్పుకు ,చాలనుకుని నీ స్నేహ ప్రాకారం

అల్లంత దూరాన అందని చందమామ
చేరునా,నా దరి  ,వచ్చునా నను కోరి ఆ భామ

సంభ్రమం ,ఆకాశం లోని దేవత , వాలింది నా పక్కన
కలయా,ఇలయా అని గిల్లి నమ్మినా .నాకీ  అదృష్టం దక్కె న!!!

అనిపిస్తోంది...... ఇదేదో నిన్నో ,మొన్నో జరిగినట్లు
మన ప్రేమ విత్తు ఇపుడే... నాటినట్లు .

గిర్రున తిరిగిన కాలం
ఉత్తరాలు గుర్తు చేసిన గతం
[3/7, 10:42 AM] Sk Mutukuru Aruna Hnk: అయుతకవితా యజ్ఞం
Sk 585
అరుణ.చామర్తి(ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :     (28)
3_3_16
అష్టమి ,నవమి మంచిది కాదని పెద్దల మాట
ఏమీ చెప్పినా మనకది మంచి భవిష్య బాట

మరి ,రామనవమి ,
        కృష్ణాష్టమి పండగలు
 అంటే -,వారు కారణ జన్ములు
వారు తెచ్చుకున్నవే అన్ని ఇడుములు

కృష్ణుడు పెరగలేదు కన్న అమ్మ చెంత
పెళ్ళాడి అష్టభార్యలు_
పొందేను ఇంతుల పోరు కొంత

పొందె రాముడు పత్ని... వియోగం
అరణ్య వాసం ,
ప్రజ ,జననీ జనకులు విలాపం

మహిమాన్వితులు ,కారణ జన్ములు వారు
మానవ మాత్రులం బాపలేము కడగండ్లు ఆ తీరు

అందుకే ,మంచివి కావని చెప్పిరి సర్వజనహితము
ఆచరణ లో చూపాలి మన ఆమోదము
[3/9, 9:37 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి(ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :స్ర్హీ (31)
8_3_16
మన దేశాన ఉంది గౌరవ ,మర్యాద స్ర్హీ అంటే
అవును ,నిజం , పరిపూర్ణ పదాలు స్ర్హీ ,పురుష

పరాయి దేశ పదాల్ల"మెన్" కి ముందు" ఉ "చేర్చడం కాదు

మనకి స్ర్హీ దేవతా స్వరూపం
అందుకే ,పోలిక
చదివితే చదువుల తల్లి అని "సరస్వతి "తో ,
లక్షణం గా ఉంటే "లక్ష్మి "తో

"ముదితల్ నేర్వగ రాని విద్య గలదే ముద్దార నేర్పించినన్ "అన్నారు ఏనాడో

కత్తి పట్టి యుద్దమూ చేయగలదు ,
కలం పట్టి సమాజం లో చెడు
దుయ్యబట్టగలదు ,
హద్దులేక నింగి కైనా
ఎగరగలదు
యమునితో పోరాడి భర్త ప్రాణాలు తేగలదు

ఏ పనైనా అవలీలగా చేయగలదు ,
త్రిమూర్తుల సైతం పసిపిల్లలు గా ఆడించే అమ్మతనము ,
సత్యభామ వంటి కలికితనము ,
గార్గి లా ,మునులతో దీటుగా
"ఆకాశం దేని యందు ఓతప్రో తమై ఉన్నదని  ప్రశ్నించే తనం
ఒకటేమిటి అన్నీ తానై ,అంతా తానై మనగల ధైర్యం ,స్థర్యం కాదా ఆమె సొంతం
అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ .చామర్తి (ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక :భూలోక బ్రహ్మ లు (32)
8_3_16

సృష్టిం చారు అపర బ్రహ్మలై   _ క్లోనిం గు తో ,అదే పోలిక_ జంతు -మనుషుల ని

వృక్ష ములను సైతం చిన్న కుండీలో బోనసాయి    గా

కడియం వారు రంగు మార్పుతో రకరకాల మందార -గులాబీ లు

మనం చూడలేదు .....నాటి ,నర _సిం హ    రూపం

చూడగలం ,నేడు _అటువంటి కొత్త     రకం

తెలుసా మీకు _వింత గాడిద    "జోం కీ "   శరీరం
జీబ్రా _గాడిద సంగమం _కొత్త ఆవిర్భావం

చూసేందుకు _ మేక రూపు ,
గొర్రె తల కలిగిన _శిరము
సగము మేను _కప్పిన ఉన్ని
"గీస్ " అను జాతి

గేదె _ఆవు సమ్మేళనం ....."బీఫే "
రంగులో న ఆవు చందం
అడవి దున్న లా చర్మం మందం

పిల్లి జాతి జీవులే _పులి ,సిం హము
రెండు కూడా భీకరాకారము
శత్రువులే ఇవి _కలిసి మరో కొత్త  రకము
ఇందులో ,చిన్ని బేధము
ఆడ పులి _మగ సింగము _"లైగరు "
మగ పులి _ఆడ మె కము _"టైగన్ "

"హె టి రో జేనేటిక్ ",జేనేటిక్ ఇంజనీరింగ్ ,క్లోనిం గు ,క్రాస్ బ్రీడ్
పద్ధతే దైనా నేమి    _సృష్టి  కర్తలు   -కనిపెట్టిన  కొత్త ,బలమై న సీడ్
మరి ,కారా వారు భూలోక _సృష్టి  కర్తలు.

కొత్త వింత జీవ జాలం ,చూడాలి అంటే
పోవలిసినదే మరి జపాన్,ఇటలీ
[3/11, 1:09 PM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk
అరుణ.చామర్తి(ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :రీ  సైకిలింగు (35)
11_3_16

పొద్దున్నే ,చదివే దినపత్రిక లు ,
వారానికో సారి వార పత్రికలు
ఏడాది చివరన  అమ్మే అచ్చు ,నోటుపొత్తాలు అన్ని అన్ని
మారతాయి కాగితపరిశ్రమ లో కొత్తగా
గాజు వస్తువులు కూడా వ్యర్ధం కాదు ,
కొత్తగ మారు మరో అవసరార్ధం

చేయవచ్చు ఇంటిలో కూడా
కూరగాయ ల ,పండ్ల చెక్కులు మట్టికి చేస్తే తోడు
తొక్కుల వ్యర్ధం ,ఎరువు ఉపయోగార్ధం

ఒకటేమిటి ,కాదేదీ అనర్హం
వాడక మిగిలిన విటమిన్ గోలీ లు
వాడిన ,ఉల్లి ,వెల్లుల్లి పొట్టు ,గుడ్డు పెంకులు
అన్ని ,అన్ని మారును సేం ద్రి యం

వాడేసిన ,నిమ్మతొ క్కులు ,కమలా చెక్కులు
స్నానపు నీటితో ,కలిపిన మోము  తళ తళ ,మేను ఘుమఘుమ

అయిపోయిన ప్లాస్టిక్కు డబ్బాలు
మారితే ,చిన్ని మొక్కల కుండీలు
భూమిలో కలవని ప్లాస్టిక్కు మరో ప్రయోజనం
కాదా అది కూడా రీ సైకిలిం గు
అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి(ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :అవగతం( 36)
11_3_16

ఓ పెద్దమనిషి కష్టపడి జీవితమంతా
కూడబెట్టి,ఇంతవరకూ ఆనందం లేదు ఇసుమంత

ఇకనైనా ,గడుపుదామని  సంతోషాన
వచ్చె నొకరు ,సన్నాహాలు చేస్తున్న సమయాన

తాను       మృత్యువు నని తెలిపిన యంత
బెంగ పడి ,ఆనక ఇవ్వజూపే ఆస్తిలో కొంత

ఎంత ఇచ్చిన    ,వద్దన,    తప్పదు అని తెలిసి
ఒక్క క్షణం కోరె ,పోయి వచ్చె నొకటి రాసి

రాసేనిట్లు ,సం పాద లో పడి వదులుకోకు సంతో షం
మృ త్యువు  ఎదురైన  ,డబ్బుఇవ్వదు అదనపు నిమిషం

ఆనందించం డి అనుకున్న క్షణం
వద్దు ,ఎపుడో నని నిరీక్షణం
[3/11, 1:14 PM] Sk Mutukuru Aruna Hnk: [10/03 11:22 pm] అరుణ . చామర్తి (ముటుకూరు: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి ( ముటుకూరు )
హన్మకొండ
శీర్షిక : ఎందుకిలా ?(34)
10_3_16

ప్రేమించు కున్నాము ఇద్దరం
వదిలేస్తాను అంటావే మీ అక్క కోసం

ప్రేమిస్తే ,నన్ను .....ఆమె కూడా
కాదంటే ,నువ్వు....వెళ్తానా తన కూడా

మీ ఇష్టమేనా ,.......నా పంపకం
ఇదెక్కడి     పితలాటకం

నువ్వు చేస్తే .........అక్క కై త్యాగం
నాకేమిటి ..........అందులో భాగం

ఆలోచించు ......
ఒకసారి కాదనుకున్నా ,
   కావాలనుకున్నా
విరిగితే అతకదు మనసు

కాల దన్నుకుని ,ఆనక వచ్చినా
కాళ్ళ బేరానికి
మనసు కలగదు తెలుసా !

నీకు ..........దూరం కాలేక ,
మరొకరికి......... దగ్గరా కాలేక
పొందే ......నరకం
అవసరమా !మనిషి ...మారకం

కలలు కని .......నీతో
కలిసి ఉంటానని ......అక్కతో
అనుకోకు పేరాశతో

వద్దనుకున్నా............ నిన్ను ,
నా ఇష్టం...... కోరుకుంటా, మరో ,........అన్నుల మిన్న ను
[11/03 9:34 am] అరుణ . చామర్తి (ముటుకూరు: అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.చామర్తి (ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక ; వేగం (34)


ఎపుడో ,చాలా కాలం క్రితం
చిన్నపిల్ల లాటలో అగ్గిపెట్టె ఫోనులు
తర్వాత ,చూశాము కబురులేన్నో చెప్పే బుల్లి పెట్టెని

అటు పిమ్మట ,వచ్చాయి కార్డ్ లెస్స ఫోనులు

ఎక్కడికి ,వెళ్ళినా మాట్లాడే లా వివ్లవం సృష్టించి తిష్ట వేస్తే చరవాణి,రకరకాలుగా

ఆపైన ,మరో బుల్లిపెట్టె పేరు కంప్యూటరు
లేప్టాపు ,టాబ్ అంటూ ఎన్నో
వయరు లేక వైఫై ,ఇపుడో కొత్త ఆవిష్కరణ లై ఫై

వైఫై సదుపాయం పరిధి మేరకే
లైఫై కి లేదు హద్దు

గాలిలో ప్రయాణం అయినా ,ఎందరు ఒకేసారి ఆన్ చేసినా ఒకే తీరు

యెల్సీడి బల్బు ఉంటే చాల ట ఏవర్గ్రీన్ గా పని చేయునట
వేగంగా సాగే కాలం తో ,పోటీగా విడ్డూరంగా
[3/13, 8:51 PM] Sk Mutukuru Aruna Hnk: [13/03 9:16 am] అరుణ . చామర్తి (ముటుకూరు: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ .చామర్తి(ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :  కాదు అనాగరికం  (38)


పరాయిదేశాల పద్దతి మనకే లా ?
ఫోర్కు ,స్పూనులతో మన ఆహారం తినడమె లా

వారి తిండికి తగినది అది
ఆలోచన ఉంటుంది మన పెద్దవారి మది

అందుకే ,నూనె తో ఉండు మన ఆహారం
స్పూను ,ఫోర్కుల కలుగు ప్రతిచర్య ,అనారోగ్య విహారం

మన చేతి స్పర్శ బలమిచ్చు ,మెదడు కు సంకేత మిచ్చు
విడుదలై జీర్ణశక్తి ,లాలాజ లం ఊరు
ప్రతీ దానిలోను ఉందొ క సూత్రం
అగ్ని తత్వ బొటన వేలు ,
వాయుతత్వ చూపుడు వేలు
ఆకాశమే మధ్య వేలు
భూమి తానైన ఉంగరపు వేలు
జలతత్వ మెనట చిటికెన వేలు
పంచ భూత సమ్మిళిత అంతస్సూత్రం
కాదు కాదు ,అనాగరికము  చేతితో కలుపుకు తినడం
పెద్దల సుద్దులు ఆచరణీ యం
[13/03 7:19 pm] అరుణ . చామర్తి (ముటుకూరు: అయుత కవితా యజ్ఞం
sk585
అరుణ.చామర్తి(ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :సాధించి  చూపు (39)

కూర్చోకు కదలక మెదలక
వదిలేయి చేతకాదు ,చేవలేదు ఈఁ మాటలు
నేర్చుకో కెరటాల చూసి
కాదు ఎగసి పడిపోతున్నం దుకు
లేస్తున్నందుకు , పడి కూడా
గద్దని చూసి గ్రహించుఆకాశం లో నుంచే ఆహారం కనిపెట్టినం దుకు
కూర్చుంటే నిర్జీవం గా లేనట్టే లెక్కలో లేనట్లే
తిడుతూ కూర్చోకు చుట్టూ ఉన్న చీకటి ని
వెలిగించు చిన్న దీపమైనా
అందిపుచ్చుకోవడం నీ వంతు
దేవుడి చ్చిన అవకాశం
అందుకోకుంటే జీవితం శాపం
పాడైన గడియారం కూడా చూపుతుంది రెండుసార్లు సరైన సమయం
కాలితో తొక్కిన ముల్లు చేస్తుంది చేత్తో తీసుకునేలా
ఒప్పుకోవద్దు ఓటమి
ప్రయత్నించు కోలుపోక ఓరిమి
చెయ్యి గెలుపు తో చెలిమి
గెలుపు నిన్ను ప్రపంచానికి చేస్తే పరిచయం
ఓటమి చేస్తుంది పరిచయం నీకు ప్రపంచాన్ని
ప్రయత్నానికి వెయ్యి తొలి బీజాన్ని
అధిరోహిస్తావు గెలుపు శిఖరాన్ని
[3/16, 10:28 AM] Sk Mutukuru Aruna Hnk: అయుతకవితా యజ్ఞం
sk 585
అరుణ చామర్తి.(ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :  ప్రాముఖ్యం (41)

పాలు ఉంటే గిన్నె నిండా మరి కలప లేవు పాలని _చక్కెర ని తప్ప
గ్లాసు నిండా ఉంటే నిమ్మ నీరు కలప లేవు _ఉప్పు ,పంచదార తప్ప
దేనికి ఇవ్వాలి ప్రాముఖ్యం  నిర్ణయం నీదే
మంచిమనుషులు తేగలరు సంతోషం _మనసు నిండా
బాపగలరు శూన్యం.
చిరాకు పడక _తెలుసుకో పనుల ప్రాముఖ్యం
నింపగలము _ఖాళీ సీసాలో బంతులు _గోలీలు _ఇసక _నీరు
దేని తర్వాత ఏది _అదే ప్రాముఖ్యం
వృత్తి -భార్యా పిల్లలూ -తల్లి తండ్రి _బంధువులు
దేని కి,ఎంత , ముందు, ప్రాముఖ్యత
అప్పుడు జీవితం ఆనందభరితం.
[3/16, 10:28 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణ.చామర్తి.(ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక :టెన్షన్ వద్దు (42)

చదివితే ఏడాది అంతా _ఇక భయం ఎందు కంట
చదివినా శ్రద్దగా _కంగారు ముంచును కొంప

ప్రశ్నాపత్ర ము ఇచ్చాక చిన్న చిరునవ్వు తో అనుకుంటే ఎంత సులభం అని
చెప్పింది అమ్మ ఆందోళన తగ్గునని
నిజమే ,"సెరటోనిన్ "విడుదలతెచ్చు పాజిటివ్ ఆలోచన
నమిలిన యాలకు ని రిలాక్స్ అగునని ,పెద్దల మాట

కొన్ని సెకన్లు మూసుకుని కళ్లు ,పీల్చుకొ గాలి తీరును చింత
తగ్గిన ఆక్సిజన్ లెవలు సరియగు నట శాస్ర్తం చెప్పిన వాస్తవత

ఎడమచేతి పిడికిలి బిగించి వదిలిన మనసు సన్నద్ధం
కరాటే ,కుంగ్ఫులలోనూ ఇదే సూత్రం సిద్దం
ఇంటరవ్యూ కి ,ఈఁ ప్రయత్నం ,తప్పక సఫలం

పరిక్ష కూ పాటించి "మౌనం "
గంట ముందు
"మటను "మానితే నెల ముందు
ఙ్ఞాపకశక్తి నీ తోడు

గిల గిల కొట్టుకుని పోయే జంతు మాంస రుచి మెండు
కాని విడుదల అయ్యే "ఎడ్రి నల్ "తెచ్చు మరపు నందు

రాసిన పిదప కూడ భాషిం చకు ,
అయిపోయిన రాత కూ ఎందుకు టెన్ష న్
[3/16, 10:28 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
sk 585
అరుణచామర్తి(ముటుకూరు)
హన్మకొండ
16_3_16
శీర్షిక :ఎన్నికలు (43)

వచ్చేసింది ఎన్నుకునే సమయం
ఎన్నికలు ,ఎన్ని కలలు
ఎన్నుకున్న తర్వాత తీరతాయని కలలు
ఎన్నిక తర్వాత తెలిసి అవి కల్లలు అని
వగచిన ఏమి కలుగు
అందుకే ,ఎన్నిక లో చూడాలి మన్నిక
లేకుంటే ,ఆనక చూస్తారా మననిక
అది దేశ,గ్రామ ,జిల్లా ఎన్నిక యె కాదు
జీవిత భాగస్వామి ఎన్నిక లో కూడా.
[3/16, 10:41 AM] Sk Mutukuru Aruna Hnk: అయుత కవితా యజ్ఞం
Sk 585
అరుణ.చామర్తి(ముటుకూరు)
హన్మకొండ
శీర్షిక : ఇన్ని భయాలా !(40)

ఇప్పుడు ఉన్న సమాజం లో నమ్మలేము ఎవరిని
మనిషి అంటే భయం "anthropophobia "అన్నారు
ఒక్కదాన్ని ఉండాలన్నాభయమే ...ఒక్కరు చెప్పగలం కాని ,మాట్లాడలేం.దానికో పేరట _"monophobia "
అంతస్తు ల ఇళ్ళలో ఎత్తు అంటే భయం దూకేస్తానని _"aerophobia "
పక్షులు అంటే కొందరికి భయం "ornithophobia "
పాములన్నా _"ophidiophobia "అంటే ఎలా అది సహజమే గా
కుక్కని చూస్తే "cynophobia "అని ,
ఉరుము ,మెరుపుల భయాన్ని "astraphobia "అనో అంటే
భయం అని చెప్పేందుకు వేస్తుంది భయం
ప్రతిదీ అంటే ఎలా ఓ రోగం అంటే
కుక్కలకీ ఉందొ ఫోబియా "aquaphobia "
అసలు ఏ భయం లేకుండా ఉంటారా ఎవరన్నా
"Glossophobia "అంటే అదీ భయమట మాట్లాడాలన్నా
పాత నమ్మకాలే నయమేమో
ఉరుము కి అర్జుననామాల
నమ్మకం
ఏ భయానికైన ,ఉంది సింధూరం
ఇపుడు ,సాయి ధుని
కొత్త ఫోబియాఒకటీ,విన్నారా నేస్తాలూ
చరవాణి లేకుంటే దగ్గర
"nomo phobia "
రామ రామ ఇన్ని భయాలా
ఇంకా ఉన్నాయి ఎన్నో భయాలూ
మనకి లేదు భయం ,అన్నిటికీ దేవునిపై వేస్తాం భారం